“టీటీఏ” (ట్రాయ్ తెలుగు అసోసియేషన్) అమెరికాలో ఎంతో మంది తెలుగువారికోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.తెలుగు పండుగలు , విశేష కార్యక్రమాలు, తెలుగు బాషా మహోశ్చవాలు వంటివి నిర్వహించడానికి ఎప్పుడు “టీటీఏ” ముందు ఉంటుంది.
అంతేకాదు “టీటీఏ” ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునారు కూడా.అయితే ఇప్పుడు తెలుగు వారి తెలుగు పండుగ అయిన ఉగాదిని ఇప్పుడు ఎంతో ఘనంగా నిర్వహించాబోతోంది.
వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని మిచిగాన్లో విళంబి నామ సంవత్సర ఉగాది సంబారాలను నిర్వహించడానికి ట్రాయ్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) నిర్ణయం తీసుకుంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లని సిద్దం చేస్తోంది.ఉగాది సంబరాలను టీటీఏ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రొచెస్టర్ హిల్స్ లోని రొచెస్టర్ అడమ్స్ హై స్కూల్‌లో జరపనున్నారు.
అయితే తెలుగువారికి ఏంతో ప్రత్యేకమైన పండుగ కావడంతో చాలా అధికసంఖ్యలో తెలుగువారు అందరూ అక్కడికి వస్తారని తెలిపింది.
ఎంతో మంది తమ పనులని సైతం పక్కన పెట్టుకుని ఈ తెలుగు పండుగకి హాజరవుతారని తెలిపారు కార్యక్రమ నిర్వాహకులు.అంతేకాదు ఈ కార్యక్రంలోనే పిల్లలకి పెద్దలకి తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలంకరణ ఉండేలా ఉండాలని కండిషన్ కూడా పెట్టారట.
తెలుగు ఆటలు పాటలు ఈ కార్యక్రంలో కనువిందు చేయనున్నాయని అంటున్నారు “టీటీఏ” నిర్వాహకులు.