పెయింటర్ గా పని చేస్తున్న కృష్ణా అనే యువకుడికి 40 రోజుల క్రితం పెళ్లి అయ్యింది.అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య కి పాలపడ్డాడు.
ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులకి ఈ ఆత్మహత్య కి గల కారణాలు తెలియక తలలు పెట్టుకుంటున్నారు.పోలీసుల కధనం ప్రకారం.
నల్గొండ జిల్లా నకిరికల్ మండలం ఒగోడు కి చాందిన వెంకన్న కి నలుగురు కొడుకులు వారిలో పెద్ద కొడుకు కృష్ణ(22 )… పెయింటర్ గా పని చేస్తున్నాడు.మరో ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు.అయితే వీరు గత కొంతకాలంగా జగద్గిరిగుట్టలో స్థిరపడుతూ వచ్చారు.అయితే గత కొన్ని రోజుల క్రితం కృష్ణ కి వివాహం అయ్యింది.
ఇదిలాఉంటే బుధవారం మౌలాలి-మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్ల మధ్య హోం సిగ్నల్ వద్ద రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య చేసుకొని ఉన్నట్లుగా గుర్తించిన రైల్వే సిబ్బంది.ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసులకు తెలిపారు
ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు…అయితే మృతుడి జేబూలో సూసైడ్ నోట్ ఉండటం గమనించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు…నా ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదు అంటూ రాస్తూ లెటర్ లో అతడి తల్లి తండ్రుల పేర్లు ఫోన్ నెంబర్ లు ఉంచారు.
వారి తల్లి తండ్రులని విచారించినా అతడి ఆత్మహత్య కి గల కారణాలు తెలియరాలేదు.పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని తరలిచిన అధికారులు మృతుడి కారణాల కోసం కేసుని దర్యాప్తు చేస్తున్నారు.