మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, 'మెగా154' భారీ షెడ్యూల్ హైదరాబాద్‌ లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

 Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby, Mythri Movie Makers Mega15-TeluguStop.com

ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు.

కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారుమెగా154 ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది.తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది.

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారుమెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు:

చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:

కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ,సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి ,పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్, మార్కెటింగ్: ఫస్ట్ షో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube