స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) కు కెరీర్ పరంగా ప్రస్తుతం అన్నీ కలిసొస్తున్నాయి.దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరగడం, వరుస విజయాలు బన్నీ ఇమేజ్ ను మార్చేశాయి.
బన్నీ మైనపు విగ్రహం ఏర్పాటు గురించి మెగా ప్రముఖ హీరోలు ఇప్పటికీ స్పందించకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

నాగబాబు, ఉపాసన( Nagababu, Upasana ) బన్నీ మైనపు విగ్రహం గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది.వరుణ్ తేజ్, సాయితేజ్, లావణ్య త్రిపాఠి కూడా సోషల్ మీడియా వేదికగా బన్నీ మైనపు విగ్రహం గురించి రియాక్ట్ అయ్యారు. చిరంజీవి, చరణ్ ( Chiranjeevi, Ram Charan )మాత్రం ఇప్పటివరకు ఈ విగ్రహం గురించి స్పందించలేదు.
అయితే అభిమానులు మాత్రం సమయం చూసి స్పందిస్తారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ బన్నీ మైనపు విగ్రహం గురించి స్పందిస్తారని భావించడం అత్యాశే అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్ బన్నీ మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరిగినా చరణ్ పుట్టినరోజుకు బన్నీ విషెస్ తెలియజేశారు.రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండగా చిరంజీవి మాత్రం విశ్వంభర సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితం అయ్యారు.బన్నీ మాత్రం పూర్తిగా పుష్ప ది రూల్ సినిమాకే పరిమియం అయ్యారట.
పుష్ప ది రూల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా బన్నీ ప్రణాళికలు ఉన్నాయి.సుకుమార్ సైతం ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని ఈ సినిమా హిట్ గా నిలిచే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదని తెలుస్తోంది.
బన్నీ సుకుమార్ కాంబోను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.