మరో సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్.. అదే తప్పు మళ్లీ చేస్తున్నాడంటూ?

మాస్ మహారాజ్ రవితేజకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రవితేజ ఈ ఏడాది ఖిలాడీ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు.

 Mass Maharaja Raviteja One More Project Fixed Details Here , Kartheek Ghattama-TeluguStop.com

అయితే రవితేజ చేతిలో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు రవితేజ చేతిలో ఉన్నాయి.అయితే మరో ప్రాజెక్ట్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగులో పలు హిట్ సినిమాలకు కెమెరామేన్ గా పని చేసి ప్రశంసలు అందుకున్న కార్తీక్ ఘట్టమనేని మంచి కథను సిద్ధం చేసుకుని రవితేజను సంప్రదించాడని కార్తీక్ చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో రవితేజ నుంచి వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం అందుతోంది.

Telugu Project, Raviteja-Movie

ఈ సినిమాకు నిర్మాత ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది.అయితే గత కొన్నేళ్లలో రవితేజ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా రవితేజ కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నాడనే భావన చాలామందిలో ఉంది.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.రవితేజ అభిమానులు మాత్రం మాస్ మాహారాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో తెగ సంతోషిస్తున్నారు.

Telugu Project, Raviteja-Movie

రవితేజ తను హీరోగా తెరకెక్కే సినిమాల షూటింగ్ లు వేగంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సీనియర్ స్టార్ హీరోలలో ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న కొంతమంది హీరోలలో రవితేజ కూడా ఒకరని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube