మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన, "ధమాకా" రొమాంటిక్ గ్లింప్స్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ “ధమాకా”.ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.

 Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, People Media Factory�-TeluguStop.com

రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది.

వినాయక చవితి సందర్భంగా ధమాకా రొమాంటిక్ గ్లింప్స్ ని విడుదల చేశారు.

రవితేజ, శ్రీలీల కేవలం కళ్ల ద్వారా మాట్లాడుకుంటున్న ఈ గ్లింప్స్ వారి సిజిలింగ్ కెమిస్ట్రీని రొమాంటిక్ గా ప్రెసెంట్ చేసింది.రవితేజ, శ్రీలీల ల కెమిస్ట్రీ అద్భుతంగా వుంది.

చాలా కాలం తర్వాత రవితేజ మార్క్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ధమాకా.త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

తారాగణం

: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల,పీఆర్వో: వంశీ శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube