తల్లికి రెండో పెళ్లి చేసిన ప్రముఖ నటుడు.. ఐ లవ్ యూ అమ్మ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతూ?

కొడుకుకు రెండో పెళ్లి చేసిన తల్లి గురించి చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం.అయితే ఒక ప్రముఖ నటుడు మాత్రం తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

 Marathi Actor Siddharth Chandekar Gets Mother Married 2 Nd Time Details, Marathi-TeluguStop.com

వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా మరాఠీ సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సిద్దార్థ్ చందేకర్( Siddharth Chandekar ) తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.తాజాగా ఈ నటుడు నటించిన సిటీ ఆఫ్ డ్రీమ్స్( City Of Dreams ) అనే వెబ్ సిరీస్ విడుదలైంది.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సిద్దార్థ్ తన తల్లికి రెండో పెళ్లి చేయగా అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిద్దార్థ్ చందేకర్ తల్లి రెండో పెళ్లికి( Siddharth Chandekar Mother ) సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.తన తల్లి పెళ్లి గురించి సిద్దార్థ్ స్పందిస్తూ అమ్మా.

హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చారు.నీ బిడ్డలతో పాటు నీ లైఫ్ కూడా ఇంకా ఉంది అంటూ సిద్దార్థ్ కామెంట్ చేశారు.

Telugu Marathi, Mother-Movie

నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉందని ఇప్పటివరకు మాకోసం చాలావరకు త్యాగం చేశావని అన్నారు.ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.ఈ విషయంలో పిల్లలు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని సిద్దార్థ్ కామెంట్లు చేశారు.మీరు నా పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేశారని ఇప్పుడు నేను అదే పని చేస్తున్నానని సిద్దార్థ్ అన్నారు.

Telugu Marathi, Mother-Movie

తన తల్లి రెండో పెళ్లి నేను అత్యంత ఎక్కువగా ఆనందపడే పెళ్లి అని సిద్దార్థ్ పేర్కొన్నారు.ఐ లవ్ యూ అమ్మా.హ్యాపీ మ్యరీడ్ లైఫ్ అంటూ సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.సిద్దార్థ్ చందేకర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube