టాలీవుడ్ హీరో మంచు మనోజ్, తాజాగా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.భూమా మౌనిక మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి చిన్న కూతురు అన్న విషయం తెలిసిందే.
ఎప్పటినుంచో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ శుక్రవారం రాత్రి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే మూడు మంచు మనోజ్ పెళ్లిని అక్క మంచు లక్ష్మీ తన ఇంట్లో జరిపించడమే కాకుండా అన్ని తానై అన్ని పనులను దగ్గర నుండి చూసుకుంది.ఈ క్రమంలోనే మంచు మనోజ్ పెళ్లి తర్వాత తన అక్క గొప్పతనం గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దేవుడిచ్చిన గొప్ప వరం అంటూ అక్క అలా మంచు లక్ష్మి పై ప్రేమ వర్షం కురిపించారు.ఇది ఇలా ఉండే తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు మంచు మనోజ్.తన భార్య మౌనిక చేతిలో చేయి వేసి ఆమె బాధ్యత తనదే అన్నట్టుగా ఉండే ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.అందుకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివుడి ఆజ్ఞ అని రాసుకొచ్చాడు మంచు మనోజ్.
ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో, ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ ని చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతే కాకుండా నవ వధువు వరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ ఫోటోలో ఒక చిన్న కుర్రాడి చేతులు కూడా కనిపించడంతో ప్రస్తుతం అందరి చూపులు ఆ చిన్నారిపై పడ్డాయి.భూమా మౌనిక మనోజ్ చేతులతో పాటు ఉన్న ఆ చిన్నారి చేతులు ఎవరివి అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.మనోజ్‌కి మొదటి భార్య ప్రణతి రెడ్డితో పిల్లలు లేరు.అలాగే మౌనిక రెడ్డి మొదటి వివాహంలోనూ పిల్లలు లేరు.పోనీ మంచు విష్ణు కొడుకు అలా పట్టుకున్నాడా లేకపోతే ఆ అబ్బాయి వేరే ఎవరా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.