మొటిమలు.చర్మ సౌందర్యాన్ని పాడు చేయడమే కాదు మనో ధైర్యాన్ని, మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి.
ముఖంపై మొటిమ వచ్చిందంటే చాలు చాలా మంది తెగ హైరానా పడిపోతుంటారు.మొటిమల వల్ల ఎక్కడ తమ అందం తగ్గిపోయిందో అని లోలోన మదన పడుతూ ఉంటారు.
పైగా ఒక్కోసారి మొటిమలు వచ్చాయంటే అంత సులభంగా తగ్గవు.దాంతో మరింత బాధపడుతూ ఉంటారు.
అయితే ఇకపై మొటిమలతో వర్రీ వద్దు.ఎందుకంటే రెండు రోజుల్లోనే మొటిమలను తరిమికొట్టవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.
మరి ఆ రెండు పదార్థాలు ఏంటి.వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు రెండు లేదా మూడు గులాబీ పూలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి రేకులు తుంచి పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ ను వేసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే గులాబీ రేకులు వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ ను వేసుకుని కనీసం పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హీట్ చేసిన వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ మ్యాజికల్ వాటర్ మొటిమలను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి.ఈ వాటర్ ను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజుకు మూడు సార్లు ఈ వాటర్ ను ముఖానికి స్ప్రే చేసుకోవాలి.
ఇలా చేస్తే కేవలం రెండు రోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పడతాయి.అలాగే మొటిమలు తాలూకు మచ్చలు సైతం మాయమవుతాయి.వేగంగా మొటిమలను తగ్గించుకోవాలని భావించేవారు తప్పకుండా గులాబీ రేకులు మరియు ములేటి పౌడర్ తో పైన చెప్పిన విధంగా మ్యాజికల్ వాటర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.