పవర్ ఎన్నో రకాలుగా తయారవుతుంది.సూర్యరష్మి నుంచి పవర్ తయారీ, హైడ్రో పవర్, బొగ్గు నుంచి థర్మల్ పవర్, యురేనియం నుంచి న్యూక్లియర్ పవర్( Nuclear power ), గాలి మరల నుంచి విండ్ పవర్ వస్తుందని మనం విన్నాం.
కానీ గాలి ద్వారా పవర్ వస్తుందంటే కాస్త విడ్డురంగా ఉన్నప్పటికీ మీరు విన్నది నిజమే.నీటి వనరులు అయిపోతే హైడ్రో పవర్ ఉత్పత్తి కాదు.
బొగ్గు నిల్వలు అయిపోతే థర్మల్ పవర్, యురేనియం నిల్వలు అయిపోతే న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి కావు.ఇక గాలి మరల ఏర్పాటుతో పవర్ ఉత్పత్తి అన్నిచోట్లా సాధ్యపడదనే విషయం విదితమే.

ఇటువంటి తరుణంలో అమెరికా( America )లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచు సెట్స్ యాం హెర్స్ట్ చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ సరికొత్త విద్యుత్ ఉత్పత్తి మార్గాన్ని కనుగొని చరిత్రం సృష్టించారు.నేరుగా పలుచటి గాలి అణువుల( Air molecules ) నుంచి కూడా విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు.గాలి అనేది నీటి బిందువుల సమూహం.ఈ బిందువులలో ప్రతి ఒక్కటి ఛార్జ్‌ని కలిగి ఉంటుంది.వీటిలో విద్యుత్ శక్తి, మేఘ శక్తి సైతం దాగి ఉంటుందని వారు అంటున్నారు.

తాము ప్రయోగంలో భాగంగా చాలా గాలి బిందువులను కలిపి ఒక కృత్రిమ మేఘాన్ని సృష్టించామని కూడా ఆ శాస్త్రవేత్తలు చెప్పడం ఇపుడు ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది.ఎలక్ట్రోడ్( Electrode ) లను విడుదల చేసే సామర్ధ్యం కలిగిన జియో బ్యాక్టర్ సల్ఫర్ రిడ్యుసెన్స్ అనే బ్యాక్టీరియాలతో సహజ సిద్ధ వాతావరణంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రోటీన్ నానో వైర్లను తయారు చేయించామని వారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని ఈ ప్రయోగం నిరూపించిందని తెలిపారు.