మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్.. పూజాపై క్లాప్ కొట్టిన నమ్రత..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

 Mahesh Trivikram's Film Launched In Namrata's Presence , Namrata, Mahesh Babu, S-TeluguStop.com

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేసాడు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా స్టార్ట్ చేస్తాడని అంత భావించిన మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

ఇక ఇప్పుడు వీరి కాంబోలో మరొక సారి సినిమా రాబోతుంది.ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది.కొద్దీ సేపటి క్రితం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేసారు.మహేష్ బాబు భార్య నమ్రత హీరోయిన్ పూజా హెగ్డే మీద క్లాప్ కొట్టారు.

ఈ పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత నమ్రత, పూజా ఇద్దరు కలిసి త్రివిక్రమ్ కు స్క్రిప్ట్ అందజేశారు.మహేష్, త్రివిక్రమ్ మధ్య మనస్పర్థల కారణంగా వీరిద్దరూ సినిమా చేయడం లేదని పుకార్లు వచ్చాయి.

కానీ వీరిద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ పుకార్లకు చెక్ పెట్టారు.ఇక ఈ పూజా కార్యక్రమాలకు మహేష్ హాజరవలేదు.ఆయన భార్య నమ్రత నే దగ్గరుండి పూజా కార్యక్రమాలు చూసుకుంది.

Telugu Mahesh Babu, Namrata, Ssmb Ups, Tollywood-Movie

హాసిని అండ్ హారిక క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా అతడు సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతుంది.అలాగే ఈ సినిమా పేరు పార్థు అని అంటున్నారు.

మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ ఈ సినిమా కథ మాత్రం అతడు సినిమా కథకు దగ్గర ఉందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube