సూపర్ స్టార్ మహేష్( Mahesh ) బర్త్ డేకి ఈసారి రెండు భారీ ప్లానింగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే త్రివిక్రం డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న గుంటూరు కారం సినిమాకు( Guntur Kaaram Movie ) సంబంధించిన మరో టీజర్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
గుంటూరు కారం టైటిల్ టీజర్ లో కేవలం మహేష్ మాతమే కనిపించాడు.అయితే బర్త్ డే రోజు టీజర్ లో మాత్రం సినిమా కాన్సెప్ట్ కొంత హింట్ ఇస్తాడట త్రివిక్రం.
ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల,( Sreeleela ) మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.
ఇదే కాదు మహేష్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి( S.S.Rajamouli ) సినిమా ముహుర్తం కూడా పెట్టబోతున్నారని టాక్.మహేష్ కూడా ఈ సినిమా ముహుర్త కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలుస్తుంది.మహేష్ బర్త్ డే రోజే జక్కన్న సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని చెప్పొచ్చు.మహేష్ 29 సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి.
సినిమా కోసం మరికొద్ది రోజుల్లో వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నాడు జక్కన్న.