పవన్ కళ్యాణ్ ట్వీట్ పై స్పందిస్తూ థాంక్స్ చెప్పిన మహేష్ బాబు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.ఈ హీరోల సినిమాలు విడుదలైతే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటాయి.

 Mahesh Babu Says Thanks By Response To Pawan Kalyan Tweet Mahesh Babu, Tollywood-TeluguStop.com

ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోల సినిమాలకు గట్టి పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.

ఈ క్రమంలోనే ప్రతి క్రిస్మస్ పండుగకు పవన్ కళ్యాణ్ దంపతుల నుంచి మహేష్ బాబు కుటుంబానికి బహుమతులు వెళ్లడమే కాకుండా పవన్ కళ్యాణ్ తన తోటలో పండించిన మామిడి పండ్లను సైతం మహేష్ బాబుకు పంపిస్తూ ఎంతో స్నేహంగా ఉంటారు.

ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని గమనించిన అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడాలని ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Mahesh Babu, Pawan Kalyan, Tollywood, Tweet-Movie

ఇకపోతే మహేష్ బాబు తాజాగా నిర్మాతగా మారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సినిమా పై ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున నుంచి సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయగా మహేష్ బాబు ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube