ఓజీ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తారా.. పవన్, మహేష్ కలిస్తే మామూలుగా ఉండదంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై( OG ) అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.లైక్స్ విషయంలో ఓజీ గ్లింప్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

 Mahesh Babu Playing Key Role In Og Movie Details, Mahesh Babu, Og, Pawan Kalyan,-TeluguStop.com

అయితే ఓజీ సినిమాలో గెస్ట్ రోల్ లో మహేష్ బాబు( Mahesh Babu ) కనిపిస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వార్త నిజమైతే ఇటు పవన్ ఫ్యాన్స్, అటు మహేష్ సంతోషానికి అవధులు ఉండవు.

అటు మహేష్ బాబుకు ఇటు పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ ( Trivikram ) ఆప్తుడు అనే సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ మహేష్ ను ఓజీ మూవీలో నటించడానికి ఒప్పించారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

పవన్, మహేష్ కలిసి కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే మహేష్ సన్నిహిత వర్గాలు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.ఒకే ఫ్రేమ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కనిపిస్తే సరికొత్త రికార్డులు ఖాయమని చెప్పవచ్చు.మరోవైపు గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాపై దృష్టి పెట్టారు.

రాజమౌళి( Rajamouli ) సినిమా పూర్తయ్యే వరకు మహేష్ కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటన కూడా ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది.రాజమౌళి మహేష్ కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతుండగా కేఎల్ నారాయణ నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.ఓజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube