ఓజీ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తారా.. పవన్, మహేష్ కలిస్తే మామూలుగా ఉండదంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై( OG ) అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

లైక్స్ విషయంలో ఓజీ గ్లింప్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఓజీ సినిమాలో గెస్ట్ రోల్ లో మహేష్ బాబు( Mahesh Babu ) కనిపిస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే ఇటు పవన్ ఫ్యాన్స్, అటు మహేష్ సంతోషానికి అవధులు ఉండవు.

అటు మహేష్ బాబుకు ఇటు పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ ( Trivikram ) ఆప్తుడు అనే సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ మహేష్ ను ఓజీ మూవీలో నటించడానికి ఒప్పించారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

పవన్, మహేష్ కలిసి కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / అయితే మహేష్ సన్నిహిత వర్గాలు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.

ఒకే ఫ్రేమ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కనిపిస్తే సరికొత్త రికార్డులు ఖాయమని చెప్పవచ్చు.

మరోవైపు గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాపై దృష్టి పెట్టారు. """/" / రాజమౌళి( Rajamouli ) సినిమా పూర్తయ్యే వరకు మహేష్ కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటన కూడా ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది.

రాజమౌళి మహేష్ కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతుండగా కేఎల్ నారాయణ నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

ఓజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆ హీరోలపై ఇష్టంతో ఈ హీరోయిన్లు ఏం చేశారో తెలిస్తే..?