హనుమాన్‌ విషయంలో మైత్రి పట్టుదల.. మహేష్ తో ఢీ కి రెడీ

తేజ సజ్జా ( Teja sajja )హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్‌ సినిమా( Hanuman movie )ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విడుదల అయ్యే రోజే హనుమాన్ సినిమా కూడా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.

 Mahesh Babu Gunturu Karam Movie Vs Teja Sajja Hanuman Movie , Mahesh Babu-TeluguStop.com

దిల్‌ రాజు తో పాటు చాలా మంది నిర్మాతలు కూడా హనుమాన్ సినిమా ను వాయిదా వేసుకోవాలని, కొత్త విడుదల తేదీని చూసుకోవాలని సూచించారు.

కానీ వారు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు.సినిమా షూటింగ్ ను తాము పూర్తి చేయక ముందే విడుదల తేదీని అనుకున్నాం.మేము ప్రకటించిన తర్వాత గుంటూరు కారం సినిమా ( Gunturu karam movie )యొక్క విడుదల తేదీని ప్రకటించారు.

కనుక మేము తగ్గేది లేదు అంటూ తేల్చి చెప్పారు. కొత్త నిర్మాతకు ఇంత పట్టుదల ఏంటో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు.అసలు విషయం ఏంటి అంటే వారి వెనుక మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ ను మొదలు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్‌ హనుమాన్ సినిమా యొక్క నైజాం రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.

అంతే కాకుండా ఆంధ్రాలో కూడా కాస్త గట్టి బయ్యర్ ను హనుమాన్ నిర్మాతలు పట్టారు.అందుకే థియేటర్ల విషయం లో ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఉద్దేశ్యం తో హనుమాన్ నిర్మాతలు గుంటూరు కారం సినిమా కు పోటీ అన్నట్లుగా వెళ్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ బలం చూసుకుని ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ను ఢీ కొడుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మరి ఈ పోటీ లో ఎవరిది పై చేయి అవుతుంది అనేది తెలియాలి అంటే మరో పది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube