సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram).ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) శ్రీ లీల(Sreeleela) గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా మహేష్ బాబు ఏ సినిమా వేడుకలో కూడా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ల గురించి పెద్దగా మాట్లాడరు అనే వాదన ఉంది.బహుశా ఈ విషయం మహేష్ బాబు వరకు చేరిందో ఏమో తెలియదు కానీ ఈ వేడుకలో మాత్రం శ్రీ లీలను భారీగా హైలైట్ చేశారని చెప్పాలి.చిత్ర బృందం గురించి దర్శకుడు గురించి మాట్లాడిన అనంతరం ఈయన శ్రీల వైపు చూస్తూ నువ్వే కంగారు పడకు నేను మర్చిపోలేదు అంటూ ఆమె గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇన్ని రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది అంటే చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.మా టీం ఒక మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేశారని మహేష్ తెలిపారు.శ్రీ లీల చాలా హార్డ్ వర్క్ అని షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా కారవన్ లోకి కూడా వెళ్లకుండా అక్కడే ఉండి అందరిని సపోర్ట్ చేస్తూ ఉంటారని తెలియజేశారు.
ఇక శ్రీ లీల డాన్స్(Sreeleela Dance) గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఈ అమ్మాయితో డాన్స్ చేయడం అంటే వామ్మో .అదేం డాన్స్ అంటూ ఈమెపై పొగడ్తల వర్షం కురిపించారు.ఈ అమ్మాయితో డాన్స్ చేయాలి అంటే హీరోలకు తాట ఊడిపోతుంది అంటూ శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి మహేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.