ఎవరీయన? ఎవరిదీ భక్తి ప్రపత్తి? ఎవరిని ఎవరు సర్వస్వంగా భావిస్తున్నారు? ఈ రోజు ‘ఫాదర్‌్స డే’ అంటే ‘నాన్నల దినోత్సవం’ అనే విషయం అందరికీ తెలుసు.ఈ సందర్భంగా మీడియా ఎన్నో కథనాలు ప్రచురించింది.
ప్రసారం చేసింది.పలు రంగాలకు చెందినవారిని ఇంటర్వ్యూలు చేసి వారి నాన్నల గురించి, డాడీల గురించి, పప్పాల గురించి తెలుసుకుంది.
కొందరు తమకు తామే తమ నాన్నల గురించి సామాజిక వెబ్‌సైట్లలో పోస్టు చేశారు.అలాంటివారిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌బాబు కూడా ఉన్నారు.
ఆయన ట్విట్టర్లో తన తండ్రి గురించి చెప్పారు.ఏ కుమారుడికైనా తన తండ్రి హీరోయే కదా…! లోకేష్‌కూ అంతే.‘మా నాన్న నాకు గురు, మెంటర్, గైడ్’ అని చెప్పారు.గురు అంటే గురువు, మెంటర్, గైడ్ దాదాపు ఒకే అర్థాలిచ్చినా గైడ్ కంటే మెంటర్‌కు ఇంకా ఎక్కువ అర్థముంది.
గైడ్ అంటే మార్గదర్శి.మనకు తెలియని విషయాలు చెప్పేవాడు.
మార్గం చూపేవాడు.మెంటర్ అంటే దాంట్లో గైడ్‌తోపాటు సలహాదారు, విశ్వసనీయుడు కూడా చేరివుంటారు.
ఆ పదంలో మూడు నాలుగు రకాల పాత్రలు ఉంటాయి.ఒక్క మాటలో చెప్పలంటే తనకు అన్నీ తండ్రే అని లోకేష్ చెప్పారు.
ఈ కొడుక్కు సర్వస్వం తండ్రే.భవిష్యత్తులో పార్టీ వారసత్వం కూడా లోకేష్‌దే.
తండ్రిలా ఈయన కూడా ముఖ్యమంత్రి అవుతారా? అంటే చెప్పలేం.కొందరు నాయకులు మాత్రం అవాలని కోరుకుంటున్నారు.