కూటమి గెలుపు అనంతరం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావటం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Pawan Kalyan Sensational Comments After The Victory Of The Alliance, Pawan Kaly-TeluguStop.com

ఇది 5కోట్ల ప్రజల విజయమని పేర్కొన్నారు.దేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు.

ప్రజలు మార్పు కోరుకున్నారు.పాలన మారాలి.

కోట్లాదిమంది ప్రజల ఆకాంక్ష.ప్రజల ఇచ్చిన తీర్పు.

అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన సమయం కాదు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన సమయం.అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం.

రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది.మహిళలను వాళ్ల కాళ్లపై నిలబెట్టే సమయం ఇది.

ప్రభుత్వ ఉద్యోగులకు కంట్రిబ్యూటీ పెన్షన్ స్కీం( Contributory Pension Scheme ) విషయంలో నేను బాధ్యత తీసుకున్నాను.కచ్చితంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత కూడా తాను చూసుకుంటానని పవన్ మాట ఇచ్చారు.యువతకి చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చేలా చూస్తాను.రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా బలంగా ఉంటాయి.నేను డబ్బులు కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు.సామాన్యుడికి భుజం కాయటానికి తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.2019లో ఓడిపోయిన సమయంలో మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.ఈ గెలుపు నాకు ఆహంకారం ఇవ్వలేదు బాధ్యత ఇచ్చింది కొద్దిగా భయం కూడా వేసింది.ప్రజలు నాపై పెద్ద బాధ్యత పెట్టారు అంటూ.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube