సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేము.తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
స్ట్రేంజ్ మీడియా( Strange Media ) ఆన్‌లైన్ అనే ఒక ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.ఈ వీడియోకు 21 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.44 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక పీత( crab ) దాని పక్కనే వేసిన కంకిలోని గింజలు తింటూ కనిపించింది.
ఆ సమయంలో అది పొయ్యి మీద ఉన్న ఒక వేడివేడి పెనంలో ఉంది.దాని పక్కన ఉన్న ఆహారం ఉడుకుతూ కనిపించింది.
అంత వేడిలో ఉండి పీత చాలా ప్రశాంతంగా తినడం ఆశ్చర్యంగా అనిపించింది.ఇది చూసేందుకు మన కళ్ళను మనమే నమ్మలేనంత వింతగా ఉంది.
ఇతరులకు విందు కావడానికి ముందు ఇది తన జీవితంలోని చివరి విందు తింటుందని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు.అయితే ఇది ఒక ఎడిటెడ్ వీడియో కావచ్చని కొందరు పేర్కొన్నారు.పీత లేదా ఎండ్రకాయ( lobster ) బాగా ఫ్రై అయ్యి కనిపిస్తోందని, అది బతికే ఛాన్సే లేదని మరొక వ్యక్తి పేర్కొన్నాడు.అయితే ఈ వీడియో చూసేందుకు చాలా బాధగా ఉందని మరికొందరు పేర్కొన్నారు.
వాటిని బతికున్నప్పుడే కడాయిలో వేసి బాగా ఉడకబెట్టినట్లున్నారు, పాపం అది ఆ సమయంలో ఎంతగా బాధపడిందో అని ఒక వ్యక్తి సానుభూతి చూపించాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.