వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు 90లోనే ఔటైన ప్లేయర్లు.. ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ టాప్..!

క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ప్రతి ఆటగాడు ఎన్నో రికార్డులు, గొప్ప గొప్ప అద్భుతమైన ఇన్నింగ్స్ తన ఖాతాలో వేసుకోవాలి అని అనుకుంటాడు.చాలామంది క్రికెటర్లు ఎవరు బద్దలు కొట్టలేని చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులను సాధించారు.

 Legendary Cricketers Who Got Out At 90 Runs Sachin Grant Flower Nathan Astle Det-TeluguStop.com

కొంతమంది దిగ్గజ క్రికెటర్లు సెంచరీలు బాది తమ జట్లను గెలిపించారు.అయితే 90,99 పరుగుల మధ్య అవుట్ అయిన ఆటగాడికి ఎంత బాధ ఉంటుందో మాటల్లో వర్ణించలేం.

అంతవరకు వచ్చి కేవలం కొన్ని పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న ఆటగాళ్లు చాలానే ఉన్నారు.

అయితే అత్యధిక సార్లు వన్డే మ్యాచ్లలో సెంచరీని మిస్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ తో పాటు ఈ జాబితాలో మరో ముగ్గురు ప్లేయర్లు అత్యధిక సార్లు సెంచరీ మిస్ చేసుకున్నారు వారెవరో చూద్దాం.

సచిన్ టెండూల్కర్:

సచిన్ టెండుల్కర్ తన వన్డే కెరియర్ లో 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు సాధించాడు.ఇక ఏకంగా 18 సార్లు 90 పరుగుల వద్ద అవుట్ అయ్యి అత్యధిక సార్లు వన్డే లలో సెంచరీ మిస్ చేసుకున్న ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు.

Telugu Aravind Desilva, Cricket, Cricketergrant, Cricketernathan, Tendulkar-Spor

గ్రాంట్ ఫ్లవర్:

జింబాబ్వే జట్టు మాజీ కెప్టెన్ గ్రాంట్ ఫ్లవర్( Grant Flower ) తన వన్డే కెరియర్ లో ఆరు సెంచరీలు, 40 అర్థ సెంచరీలు సాధించాడు.తన వన్డే కెరియర్ లో ఏకంగా తొమ్మిది సార్లు 90 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీలు మిస్ చేసుకున్నాడు.

Telugu Aravind Desilva, Cricket, Cricketergrant, Cricketernathan, Tendulkar-Spor

నాథన్ ఆస్ట్లీ:

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన నాథన్ ఆస్ట్లీ( Nathan Astle ) తన వన్డే కెరియర్ లో 16 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు చేశాడు.ఇతను కూడా తన కెరియర్లో 9సార్లు 90లో అవుట్ అయ్యాడు.

Telugu Aravind Desilva, Cricket, Cricketergrant, Cricketernathan, Tendulkar-Spor

అరవింద్ డి సిల్వా:

శ్రీలంక మాజీ క్రికెటర్ అయిన అరవింద్ డి సిల్వా( Aravind Desilva ) తన వన్డే కెరియర్లో 11 సెంచరీలు, 64 అర్థ సెంచరీలు చేశాడు.ఇతను కూడా తన కెరీర్లో 9సార్లు 90 లో అవుట్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube