పెళ్లి తర్వాత అలాంటి పాత్రలలో నటించడానికి అభ్యంతరం లేదు: లావణ్య త్రిపాటి

లావణ్య త్రిపాటి(Lavanya Tripati) అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.అయితే ఈమె ప్రస్తుతం మెగా ఇంటి కోడలు కావడంతో ఈమె పై అందరి అటెన్షన్ ఉందని చెప్పాలి పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ ఫెక్ట్( Miss Perfect ) వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

 Lavanya Tripati Comments On Bold Roles After Marriage Details, Lavanya Tripati,m-TeluguStop.com

ఈ క్రమంలోనే లావణ్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా లావణ్య త్రిపాఠిని మీడియా వారు ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ఆమె నుంచి సమాధానాలు రాబడుతున్నారు ముఖ్యంగా తన ఫ్యామిలీ విషయాలను ప్రశ్నిస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం అలాగే తనకు కండిషన్లు ( Conditions ) పెట్టారనే వార్తలు గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ విషయాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ…నాకు ఎలాంటి కండిషన్స్ పెడతారు ? అసలు ఎందుకు పెడతారు ? నేను పెళ్ళికి( Marriage ) ముందు కూడా నటించాను.ఎప్పుడూ శృతి మించే విధంగా బోల్డ్ పాత్రలు( Bold Roles ) చేయలేదు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు చేయనని ఈమె తెలియజేశారు.ఇదివరకు ఎలాంటి పాత్రలలో నటించానో ఇప్పుడు కూడా అలాంటి పాత్రలలోనే నటిస్తానని, అయితే నేను భయపడి కాదు అలాంటి పాత్రలలో నటించడానికి నాకు సౌకర్యంగా ఉండదని లావణ్య త్రిపాఠి తెలిపారు.

ఇక వరుణ్( Varun )తన వృత్తిపరంగా ఎలాంటి పాత్రలలో నటించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఇద్దరం ఆ విషయం గురించి చర్చించుకుంటామని లావణ్య తన ఫ్యామిలీ విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube