Kushi Movie : ఖుషి నిడివి విషయంలో రిస్క్ తీసుకుంటున్న డైరెక్టర్.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి( kushi movie )ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Kushi Movie Big Risk With Run Time-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు విడుదల కావడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Telugu Kushi, Mythri Makers, Run Time, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

అంతే కాకుండా ఈ సినిమా పాటలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఈ సినిమా నిడివి విషయంలో సినిమా డైరెక్టర్ రిస్క్ చేస్తున్నాడేమో అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మూవీ లెన్త్ విషయానికి వస్తే.ఖుషి ఫైనల్ కట్ 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు.అయితే మాములుగా లవ్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాలకు ఇది ఎక్కువే.

చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతసేపు థియేటర్లలో కూర్చునేందుకు సుముఖంగా లేరు.

Telugu Kushi, Mythri Makers, Run Time, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

అటువంటిది దర్శకుడు శివ నిర్వాణ( Shiva Nirvana ) ఇంత డిసైడ్ చేశారంటే ఏదో ప్రత్యేక కారణం ఉండే ఉంటుందన్న అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అంతసేపు కూర్చోవడం అంటే కష్టమే అని కామెంట్ చేస్తున్నారు.ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు అని కామెంట్ చేస్తున్నారు.

కాగా ఇందులో దేవుడిని నమ్మని ఒక నాస్తికుడి కొడుకు, తెల్లారితే మొదలు దైవ ధ్యానం తప్ప మరో ప్రపంచం తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా ఖుషిని రూపొందించారు.అయితే నిడివి విషయంలో రాజీ పడకపోవడం వల్ల గతంలో నాని అంటే సుందరానికి ఎంత డ్యామేజ్ అయ్యిందో ఫ్యాన్స్ మరిచిపోలేదు.

ట్రిమ్ చేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని ఇప్పటికీ అనుకుంటారు.ఈ సినిమా విషయంలో కూడా అలాంటి డ్యామేజ్ జరుగుతుందా లేదంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి మరి.కాగా ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) పబ్లిసిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టాక్ పాజిటివ్ గా వస్తే కనక కనీసం రెండు వారాలు బలమైన రన్ దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube