మాజీ మంత్రి కేటీఆర్ పై( KTR ) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ( Shabbir Ali ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మైనార్టీలపై( Minorities ) కేటీఆర్ ది దొంగ ప్రేమని విమర్శించారు.
బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు.కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అమాయకుడిని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారన్న షబ్బీర్ అలీ మైనార్టీలకు కాంగ్రెస్( Congress Party ) అవకాశాలు ఇస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.