ఫోర్బ్స్ ఇండియా ( Forbes India )తాజాగా 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను ప్రకటించగా ఈ జాబితాలో ముకేశ్ అంబానీ( Mukesh Ambani ) అగ్రస్థానం పొందారు.అయితే ఈ జాబితాలో 100వ స్థానంలో నిలిచిన వ్యక్తి కేపీఆర్ మిల్ ఛైర్మన్ రామసామి కావడం గమనార్హం.
రామసామి( Ramasamy ) ఆర్థిక సమస్యల వల్ల కాలేజ్ చదువును మధ్యలోనే ఆపేసిన రైతు కొడుకు కాగా ఎంతో కష్టపడటం వల్లే రామసామి ఈ జాబితాలో నిలిచారు.
రామసామి ఆస్తుల విలువ ఏకంగా 19133 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
వస్త్రాలు, చక్కెర తయారీదారులలో ఒకరైన రామసామి ఈసారి ఫోర్బ్స్ జాబితాలో చేరారు.ఈయన సంస్థలో 25,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా ఈ ఉద్యోగులలో 90 శాతం మంది మహిళా ఉద్యోగులు కావడం గమనార్హం.
కరోనా మహమ్మారి సమయంలో సైతం రామసామి పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వడం గమనార్హం.
8000 రూపాయల అప్పుతో కెరీర్ ను మొదలుపెట్టిన రామసామి తన కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు.ప్రతి సంవత్సరం రామసామి సంస్థ 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తోంది.ఈ విధంగా ఈ సంస్థ వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తుండటం గమనార్హం.
స్పోర్ట్స్ వేర్ నుంచి స్లీప్ వేర్ వరకు అన్నీ ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.రామసామి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం కేపీ రామసామి ( KP Ramasamy )వయస్సు 74 సంవత్సరాలు కావడం గమనార్హం.ఉద్యోగుల విషయంలో రామసామి ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.రామసామి సక్సెస్ స్టోరీని స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు.కేపీ రామసామిని ఎంతోమంది అభిమానిస్తున్నారు.1984వ సంవత్సరంలో కేపీఆర్ మిల్ ను రామసామి స్థాపించారు.2013 సంవత్సరంలో రామసామి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు.ప్రముఖ స్టోర్లలో ఈ కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.