తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది.విరుధునగర్ జిల్లా కమ్మపాటిలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్ జరిగింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారని తెలుస్తోంది.
అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యాక్టరీ ఎదుట ఉన్న బాణాసంచా దుకాణంలో పటాకులను కాల్చుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని సమాచారం.కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.