హుజూరాబాద్ ఫలితం పై కోమటిరెడ్డి ఫైర్ ! రేవంత్ టార్గెట్ గా విమర్శలు ?

హుజురాబాద్ ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే ఆ ఫలితాలపై విశ్లేషణ మొదలైపోయింది.ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది అనే అభిప్రాయాలు ముందు నుంచి వస్తూ ఉండటం,  దానికి తగ్గట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతు ఇచ్చినట్లుగా వ్యవహరించడం ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

 Komati Reddy Venkat Reddy Sensational Comments On Huzurabad Elections Targets Re-TeluguStop.com

  తాజాగా ఈ విషయంపై పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
  ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలు అయినా,  కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఈ నియోజకవర్గంలో ఒక్క సభ కూడా నిర్వహించలేదని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

  దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పని చేసినట్లుగా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం లో బలమైన క్యాడర్ ఉంది అని , అయినా ఆయన దానిని తమవైపు తిప్పుకోవడం లో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదని  వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని,  కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాను అంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Komati Venkat, Pcc-Telugu Political

అయితే ఎన్నికల ఫలితాలు పూర్తికాకుండానే వెంకటరెడ్డి ఈ విధమైన విమర్శలు చేస్తుండడంతో రేవంత్ టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో మొదలైంది.అసలు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కక ముందు నుంచి వెంకట్ రెడ్డి ఈ విషయంలో ఇదే విధమైన వైఖరితో ఉంటూ వస్తున్నారు.అలాగే పిసిసి అధ్యక్ష పదవి కోసమూ వెంకటరెడ్డి ప్రయత్నాలు చేశారు.

అయినా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టింది .అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో పరోక్షంగా రేవంత్ ఇరుకున పెట్టే విధంగా ఆయన విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube