భారీ అంచనాలతో థియేటర్లలో నిన్న విడుదలైన పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.విక్రమ్ కోసం ఈ సినిమాను థియేటర్లలో చూడాలని అనుకున్న అభిమానులు నిరాశకు గురయ్యారు.
సినిమాలో విక్రమ్ పాత్ర 15 నిమిషాలకే పరిమితం కావడం ఆయన అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.సినిమాలో పాటలు సైతం తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా లేకపోవడం గమనార్హం.
పొన్నియిన్ సెల్వన్ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తెలుగులో మాత్రం డిజాస్టర్ గా నిలిచే అవకాశం అయితే ఉంది.అయితే తెలుగు క్రిటిక్స్ ఈ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇవ్వడంతో తమిళ క్రిటిక్ ఫైర్ అయ్యారు.
ఈ సినిమాకు టాక్ ఆశించిన విధంగా లేకపోయినా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని తెలుస్తోంది.ఏ సెంటర్లలో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోందని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.పొన్నియన్ సెల్వన్ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇవ్వడంతో తెలుగు సినిమాలను ఫ్లాప్ చేస్తామంటూ తమిళ క్రిటిక్ బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.
తమిళ క్రిటిక్ పీఆర్ రంగస్వామి తమిళంలో సక్సెస్ సాధించే తెలుగు సినిమాల విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.కావాలనే తమిళ సినిమాలపై అక్కసును వెళ్లగక్కితే మీ సినిమాలను డిజాస్టర్ చేస్తామంటూ ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
అయితే ప్రశాంత్ రంగస్వామి ట్వీట్ కు ఒక నెటిజన్ ఘాటుగా బదులిచ్చారు.సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించే విషయంలో ముందువరసలో ఉంటారని పేర్కొన్నారు.సినిమా బాగుంటే టాలీవుడ్ ప్రేక్షకులే ఆదరిస్తారని సినిమా బాలేకపోతే ఏం చేస్తారని సదరు నెటిజన్ పేర్కొన్నారు.నెటిజన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.