మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్..!

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.భారత జట్టు( Team India ) బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు.

 Kl Rahul Leaves Behind Ms Dhoni In Major Captaincy Record Details, Kl Rahul Ms-TeluguStop.com

దీంతో దక్షిణాఫ్రికా 116 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్( KL Rahul ) భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉండే ఒక రికార్డును బ్రేక్ చేశాడు.

మహేంద్ర సింగ్ ధోని( Mahendrasingh Dhoni ) కెప్టెన్సీలో 2013లో భారత్ వరుసగా తొమ్మిది విజయాలను సాధించింది.కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత్ వరుస 10 విజయాలను సాధించింది.దీంతో మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ బ్రేక్ అయింది.

భారత జట్టు కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ( Rohit Sharma ) అగ్రస్థానంలో ఉన్నాడు.రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2019 నుంచి 2022 వరకు భారత జట్టు వరుసగా 19 మ్యాచులు గెలిచింది.

ఈ జాబితాలో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) రెండవ స్థానంలో నిలిచాడు.విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017లో భారత జట్టు వరుసగా 12 మ్యాచ్లలో విజయం సాధించింది.2018 లో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు 12 వరుస విజయాలను సాధించింది.దక్షిణాఫ్రికాలో పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.భారత జట్టు అనుకున్న విధంగానే తొలి వన్డే లో ఓ అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సిరీస్ లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ దే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube