నేరుగా ఓటిటిలో విడుదలవుతున్న ‘కిన్నెరసాని’ చిత్రం..

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ.ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5.

 Kinnerasani' Is Set For A Direct Ott Release Zee5 , Kalyaan Dhev , Kinnerasani-TeluguStop.com

తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు.కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు.

జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు.

మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

వేద అనే అమ్మాయి.తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది.

అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు.మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు.

రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు.ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, అన్ శీతల్, కాశిష్ ఖాన్,.రవీంద్ర విజయ్, మహతి బిక్షు తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: రమణ తేజ, నిర్మాత: రామ్ ప్రసాద్ తళ్లూరి, రైటర్: సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస, ఎడిటర్: అన్వర్ అలీ లిరిసిస్ట్: కిట్టు విస్సాప్రగడ, బ్యానర్: SRT ఎంటర్‌టైన్మెంట్స్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube