ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ కేసును రెండు కోణాల్లో చూడాలన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ బాధితులమని చెప్తున్నాయి.మరి దోషి ఎవరని ఆయన ప్రశ్నించారు.
తామే విచారణ చేస్తామనడంతో బీఆర్ఎస్ లోపం బయటపడిందన్నారు.నేరం జరగలేదంటూ సీబీఐ విచారణ అడగడంతో బీజేపీ లోపం తెలిసిందని తెలిపారు.
రాజకీయ అవసరాలకు దర్యాప్తు సంస్థలను వాడుతున్నారని వెల్లడించారు.కేసులో ఉన్న నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ మారినవారేనని పేర్కొన్నారు.
పార్టీ మారిన వారికి బీఆర్ఎస్ లో మంచి పదవులిచ్చారని విమర్శించారు.ఇది కూడా కరప్షన్ కిందకే వస్తుందన్నారు.
ప్రలోభాల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంపై చర్చిస్తున్నామని తెలిపారు.ఈ మేరకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి విచారణ జరగాలన్న రేవంత్ రెడ్డి 2018 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపులపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
.