అమెరికా : హెచ్ -4 వీసా పై కీలక బిల్లు..అమలైతే..!!!

అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళే ప్రతీ ఒక్క వలస వాసికి తప్పనిసరిగా హెచ్-1బి వీసా ఉండి తీరాల్సిందే.ఈ వీసా ఆధారంగానే అమెరికా కంపెనీలలో పనిచేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ నిపుణులు అమెరికా వెళ్తుంటారు.

 Key Bill On H-4 Visa In America H-4 Visa,  America , Caroline Bordeaux, Elvira S-TeluguStop.com

ముఖ్యంగా భారతీయ నిపుణులు ఈ వీసాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు.అయితే ఈ హెచ్-1బి వీసా పొందిన వారెవరైనా సరే వారి జీవిత భాగస్వాములను హెచ్-4 వీసా ద్వారా అమెరికా తీసుకువెళ్లచ్చు, అక్కడ ఉద్యోగం చేసుకునే హక్కును పొందవచ్చు.

కేవలం హెచ్-1బి వీసా కలిగిన వారు మాత్రమే కాదు హెచ్ -2ఏ, హెచ్-2బి, హెచ్-3 వీసాలను పొందిన వారి జీవిత భాగస్వాములకు వారి పిల్లలకు కూడా హెచ్-4 వీసా పొందే అర్హతను కలిగి ఉంటారు.

ఇదిలాఉంటే హెచ్-1బి వీసా దారులు తమ భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే అది కేవలం హెచ్ -4 వీసా ద్వారా సాధ్యపడుతుంది.

అయితే ఈ వీసా ఉన్నా సరే వారు నేరుగా ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లేదు దాంతో ఇకపై హెచ్ -4 వీసా పొందిన వారు ఎవరైనా సరే నేరుగా ఆటోమేటిక్ గా ఉద్యోగ అవకాశం పొందే హక్కును కల్పించే విధంగా ఈ కొత్త బిల్లును రూపొందించారు.ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కరోలిన్ బోర్దేక్స్, ఎల్విరా సలాజర్ ఈ ఇద్దరు మహిళా సభ్యులు ఈ కొత్త బిల్లు హెచ్ -4 ఆటోమేటిక్ ఆధరైజేషన్ యాక్ట్ ను అమలులోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారు.

Telugu America, Automatic, Elvira Salazar, Visa, Form, Telugu Nris-Telugu NRI

అమెరికాలో ఉద్యోగం చేసే హక్కును హెచ్ -4 వీసా ఉన్న వారు ఆటోమేటిక్ గా హక్కుగా పొందే వీలును కల్పించడం ద్వారా వారికి తొందరగా ఉద్యోగ అవకాశం దొరకడమే కాకుండా భాగస్వాములకు ఆర్ధిక తోడును అందిస్తారని తెలిపారు.గతంలో హెచ్ -4 వీసా కలిగిన వారు ఉద్యోగం పొందడం కోసం I -765 ఫార్మ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేదని ఈ బిల్లు గనుకా ఆమోదం పొందితే ఈ ఫార్మ్ అవసరం ఉండదని ప్రకటించారు.అయితే ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో ఎంత మంది మద్దతు ఉంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube