అమెరికా : హెచ్ -4 వీసా పై కీలక బిల్లు..అమలైతే..!!!

అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళే ప్రతీ ఒక్క వలస వాసికి తప్పనిసరిగా హెచ్-1బి వీసా ఉండి తీరాల్సిందే.

ఈ వీసా ఆధారంగానే అమెరికా కంపెనీలలో పనిచేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ నిపుణులు అమెరికా వెళ్తుంటారు.

ముఖ్యంగా భారతీయ నిపుణులు ఈ వీసాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు.అయితే ఈ హెచ్-1బి వీసా పొందిన వారెవరైనా సరే వారి జీవిత భాగస్వాములను హెచ్-4 వీసా ద్వారా అమెరికా తీసుకువెళ్లచ్చు, అక్కడ ఉద్యోగం చేసుకునే హక్కును పొందవచ్చు.

కేవలం హెచ్-1బి వీసా కలిగిన వారు మాత్రమే కాదు హెచ్ -2ఏ, హెచ్-2బి, హెచ్-3 వీసాలను పొందిన వారి జీవిత భాగస్వాములకు వారి పిల్లలకు కూడా హెచ్-4 వీసా పొందే అర్హతను కలిగి ఉంటారు.

ఇదిలాఉంటే హెచ్-1బి వీసా దారులు తమ భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే అది కేవలం హెచ్ -4 వీసా ద్వారా సాధ్యపడుతుంది.

అయితే ఈ వీసా ఉన్నా సరే వారు నేరుగా ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లేదు దాంతో ఇకపై హెచ్ -4 వీసా పొందిన వారు ఎవరైనా సరే నేరుగా ఆటోమేటిక్ గా ఉద్యోగ అవకాశం పొందే హక్కును కల్పించే విధంగా ఈ కొత్త బిల్లును రూపొందించారు.

ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కరోలిన్ బోర్దేక్స్, ఎల్విరా సలాజర్ ఈ ఇద్దరు మహిళా సభ్యులు ఈ కొత్త బిల్లు హెచ్ -4 ఆటోమేటిక్ ఆధరైజేషన్ యాక్ట్ ను అమలులోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారు.

"""/"/ అమెరికాలో ఉద్యోగం చేసే హక్కును హెచ్ -4 వీసా ఉన్న వారు ఆటోమేటిక్ గా హక్కుగా పొందే వీలును కల్పించడం ద్వారా వారికి తొందరగా ఉద్యోగ అవకాశం దొరకడమే కాకుండా భాగస్వాములకు ఆర్ధిక తోడును అందిస్తారని తెలిపారు.

గతంలో హెచ్ -4 వీసా కలిగిన వారు ఉద్యోగం పొందడం కోసం I -765 ఫార్మ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేదని ఈ బిల్లు గనుకా ఆమోదం పొందితే ఈ ఫార్మ్ అవసరం ఉండదని ప్రకటించారు.

అయితే ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో ఎంత మంది మద్దతు ఉంటుందో వేచి చూడాల్సిందే.

Viral : కోతుల దెబ్బకి గోరిల్లాలా మారిన గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అసలు మ్యాటరేంటంటే…?!