తమ పెళ్లి గురించి నలుగురు మాట్లాడుకోవాలి, అబ్బ వాడు ఏం పెళ్లి చేసుకున్నాడురా అని అంతా అనుకోవాలని చాలా మంది అనుకుంటారు.అందుకే పెళ్లి ఏర్పాట్లు కాస్త అప్పు అయినా కూడా రిచ్‌గా చేస్తారు.
భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పెళ్లి చేసుకుంటారు.తాజాగా బెంగళూరుకు చెందిన సునీల్ అనే వ్యక్తి తన పెళ్లి గురించి నలుగురు మాట్లాడుకోవాలని భావించాడు.
అందుకు తగ్గట్లుగా తన పెళ్లి ఆహ్వాన పత్రిక చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేశాడు.ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో అదే తరహాలో పెళ్లి కార్డు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు.
పెళ్లి కార్డును ఓటరు గుర్తింపు కార్డు తరహాలో ఉండేలా ప్లాన్ చేశాడు.చూడగానే ఇది ఓటరు గుర్తింపు కార్డు కదా అన్నట్లుగా ఉండేలా డిజైన్ చేయించాడు.విభిన్నమైన పెళ్లి కార్డుతో అనుకున్నట్లుగానే సునీల్ పెళ్లి గురించి స్థానికంగానే కాకుండా బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది.ఇలాంటి విచిత్రమైన ఆలోచన చేసినందుకు సునీల్ మరియు అతడి బంధుమిత్రులను జనాలు అభినందిస్తున్నారు.
నిజంగా చాలా విభిన్నంగా ఆహ్వాన పత్రిక ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారు.
తాజాగా వివాహ నిశ్చితార్థం అయిన సునీల్, అన్నపూర్ణల పెళ్లి ఈనెల 26న జరిపించబోతున్నారు.కుటుంబ సభ్యులు ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు.ఓటర్లకు ఓటు హక్కును గుర్తు చేసే ఉద్దేశ్యంతో పాటు, తన పెళ్లి గురించి నలుగురు మాట్లాడుకోవాలనే ఉద్దేశ్యంతో సునీల్ చేసిన పనిని స్థానిక ఎన్నికల అధికారులు మరియు రాజకీయ నాయకులు కూడా అభినందిస్తున్నారు.
మొత్తానికి సునీల్, అన్నపూర్ణల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగేందుకు భారీగా పబ్లిసిటీ అయితే జరిగింది.ఇక ఎంత మంది వస్తారో చూడాలి.