బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా వదిలించుకోవడానికి హోమ్ మేడ్ పాక్స్

ప్రతి అమ్మాయి మచ్చలు లేని అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది.ముఖం మీద మొటిమలు రావటం,బ్లాక్ హెడ్స్ రావటం సహజమే.

 Excellent Face Packs To Remove Blackheads-TeluguStop.com

ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా జిడ్డు చర్మం వారికి వస్తూ ఉంటాయి.చర్మంలో అధికంగా నూనె ఉత్పత్తి అవటం వలన చర్మ రంద్రాలు మూసుకుపోతాయి.

దాంతో బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి.అలాంటి బ్లాక్ హెడ్స్ తొలగించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి.

సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి పాక్స్ తెలుసుకుందాం.

ఒక స్పూన్ గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

<img style=”width: 50%; display: inline;” src=”https://telugustop.com/wp-content/uploads/2018/04/excellent-face-packs-to-removeblackheads.jpg” alt=””>


ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే ఫలితం కనపడుతుంది.

తాజా కలబంద గుజ్జును ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు ఈ ప్యాక్ ఉపయోగిస్తే చర్మం బిగుతుగా మారి మూసుకున్న చార్మ్ రంద్రాలు తెరుచుకుంటాయి.దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.

ఒక స్పూన్ పసుపులో సరిపడా పుదీనా రసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన చర్మ రంద్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube