బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా వదిలించుకోవడానికి హోమ్ మేడ్ పాక్స్

ప్రతి అమ్మాయి మచ్చలు లేని అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది.ముఖం మీద మొటిమలు రావటం,బ్లాక్ హెడ్స్ రావటం సహజమే.

ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా జిడ్డు చర్మం వారికి వస్తూ ఉంటాయి.చర్మంలో అధికంగా నూనె ఉత్పత్తి అవటం వలన చర్మ రంద్రాలు మూసుకుపోతాయి.

దాంతో బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి.అలాంటి బ్లాక్ హెడ్స్ తొలగించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి.

సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి పాక్స్ తెలుసుకుందాం.ఒక స్పూన్ గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" Alt=""<img Style="width: 50%; Display: Inline;" Src="" Alt=""> ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే ఫలితం కనపడుతుంది.!--nextpage తాజా కలబంద గుజ్జును ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు ఈ ప్యాక్ ఉపయోగిస్తే చర్మం బిగుతుగా మారి మూసుకున్న చార్మ్ రంద్రాలు తెరుచుకుంటాయి.

దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.ఒక స్పూన్ పసుపులో సరిపడా పుదీనా రసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయటం వలన చర్మ రంద్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది.దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!