Prabhas : భారీ ధరలకు కల్కి డిజిటల్ రైట్స్.. షాక్ లో అమెజాన్ నెట్ ఫ్లిక్స్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇటీవల సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ ( Prabhas ) త్వరలోనే కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

 Kalki Movie Team Demanding 200 Crores For The Ott Rights-TeluguStop.com

ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు అయితే ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడొచ్చు అనే వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు మేకర్స్ స్పందించలేదు.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్( Digital Rights ) గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను కోసం మూవీ మేకర్స్ రూ.200 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కానీ ఓటీటీ సంస్థలు మాత్రం రూ.150 కోట్లు-రూ.170 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయట.కానీ మేకర్స్ మాత్రం 200 కోట్ల రూపాయల వరకు ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇలా ఈ సినిమా డిజిటల్ హక్కులకు ఇంత డిమాండ్ ఉండడంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ నెట్ ఫ్లిక్స్ షాక్ అయ్యారని తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా డిజిటల్ డీల్ గురించి అమెజాన్ లేదా నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయాలను మేకర్స్ కానీ లేదా ఓటీటీ సంస్థలు కానీ ఎక్కడ వెల్లడించలేదు.సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube