బాబాయ్ అంటే ఆ మాత్రం గౌరవం లేదా.. ఎన్టీఆర్ తీరుపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్?

నందమూరి తారకరామారావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగు పెట్టినప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఇంటి పేరును ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలబెడుతున్నారు.ఇలా ఈ హీరోలిద్దరూ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Junior Ntr Not Wished Nandamuri Balakrishna On Birthday Details, Jr Ntr, Tollyw-TeluguStop.com

ఇకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్థలు ఏర్పడ్డాయని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో నిజం లేదు అంటూ ఎప్పటికప్పుడు కొట్టిపారేసిన వీరి వ్యవహార శైలి మాత్రం వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్థలు ఉన్నాయని చెబుతోంది.

బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ కుమారుడిగా ఎన్టీఆర్ పేరుపొందారు అయితే హరికృష్ణ మరణించిన తర్వాత కూడా ఎన్టీఆర్ బాలకృష్ణకు దగ్గర కాలేకపోయారు.ఇకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని తాజాగా మరొక విషయం ద్వారా బయట పడింది.

జూన్ 10వ తేదీ బాలకృష్ణ ఎంతో ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.అయితే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు పెద్దఎత్తున ఘనంగా జరపడమే కాకుండా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

ఇక బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకోవడంతో ఎన్టీఆర్ కనీసం తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియ చేయకపోవటంతో పలు విమర్శలు ఎదురవుతున్నాయి.

Telugu Balakrishna, Fans, Jr Ntr, Ntr Babai, Telugu, Tollywood-Movie

ఈ క్రమంలోనే బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ బాబాయ్ అంటే కనీస గౌరవ మర్యాదలు కూడా లేకపోతే ఎలా?కనీసం పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేయాలి కదా ఆ మాత్రం తీరిక లేకుండా ఎన్టీఆర్ గడుపుతున్నారా? అంటూ పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ తీరు పై కామెంట్లు చేశారు.అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ చేయకపోయినా వ్యక్తిగతంగా తనకు శుభాకాంక్షలు చెప్పి ఉంటారు అంటూ ఎన్టీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube