అందుకే దానిపై ఆసక్తి తగ్గింది.. షాకింగ్ విషయాలు చెప్పిన ఎన్టీఆర్?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారెవ్వరూ లేరు.నందమూరి కుటుంబం నుండి వచ్చిన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గా ప్రేక్షకుల హృదయాలలో అభిమాన హీరోగా మారాడు.

 Jr Ntr Shares Why He Lost Interest In Watching Cricket Jr Ntr, Tollywood, Watch-TeluguStop.com

ఎన్నో సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.స్టార్ హీరోగా ఎదిగాడు.

ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈయన తనకు ఓ దానిపై ఆసక్తి తగ్గింది అంటూ కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు తో హోస్టింగ్ చేస్తున్నాడు.ఇక పలు ఎపిసోడ్ లు కూడా పూర్తవ్వగా తాజా ఎపిసోడ్ లో తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఈ ఎపిసోడ్ కు అభిరామ్ అనే కంటెస్టెంట్ పాల్గొనగా అందులో తొమ్మిదవ ప్రశ్న దగ్గర క్రికెట్ ఆటకు సంబంధించిన ప్రశ్న వచ్చింది.ఇక క్రికెట్ గురించి స్పందించిన ఎన్టీఆర్.తనకు క్రికెట్ ఆడటమంటే ఇష్టమని తెలిపాడు.

Telugu Harikrishna, Jr Ntr, Intrest Cricket, Rrr, Tollywood, Cricket-Movie

కానీ టీవీలో చూడటం మాత్రం ఇష్టపడనని దీనికి కారణం తన తండ్రి హరికృష్ణ అని తెలిపాడు.తన చిన్నతనంలో తన తండ్రి ఉదయాన్నే టీవీలో వచ్చే క్రికెట్ ను వీసీఆర్ లో రికార్డ్ చేయమని చెప్పాడట.దాంతో ఆ మ్యాచ్ ను తను పూర్తిగా చూడాల్సి వచ్చిందని మళ్లీ అదే మ్యాచ్ ను సాయంత్రం కూడా తన తండ్రితో చూడటంతో బోర్ కొట్టిందని తెలిపాడు.అందుకే తనకు క్రికెట్ పై ఆసక్తి తగ్గిందని తెలిపాడు.

Telugu Harikrishna, Jr Ntr, Intrest Cricket, Rrr, Tollywood, Cricket-Movie

ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఫిక్స్ చేశాడు.అంతేకాకుండా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube