ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ ఆఫీసుపై దుండుగులు శుక్రవారం దాడి చేశారు.కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే ఈ దాడి చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.ఏఎస్పీ శ్రీనివాస్ను కలిసి జనసేన నేత రామ్మోహన్ దీనిపై ఫిర్యాదు చేశారు.
ఇక బీజేపీ నేతలు జనసేన ఆఫీసుకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.వైసీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.