అమెరికా కు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన ఘటన ఇప్పటికి అమెరికన్స్ మర్చిపోలేక పోతున్నారు.ట్రంప్ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత తన అభిమానులను పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన ప్రసంగమే క్యాపిటల్ హిల్ పై దాడికి కారణమైందని, నిర్ధారించుకున్న విచారణ కమిటి ఆ దిశగా విచారణ చేపట్టింది.
క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందగా, అల్లర్లకు పాల్పడిన వారిలో ఒకరు మృతి చెందారు.ఈ క్రమంలోనే బిడెన్ అధ్యక్షుడుగా ఎన్నిక అవడంతో క్యాపిటల్ హిల్ పై దాడికి పాల్పడిన వారిపై , భాద్యులపై కటినమైన చర్యలు తీసుకోవాలని విచారణ కమిటి ని వేసారు.
గడిచిన నెలలుగా ఈ కమిటి చేసిన విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.ఈ దాడి ఘటనలో ట్రంప్ కు అత్యంత సన్నిహితుడికి ప్రమేయం ఉందని, ట్రంప్ ప్రమేయం పట్ల అనుమానాలు ఉన్నాయని అందుకు కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని అయితే మరింత లోతైన విచారణలో భాగంగా విచారణ కమిటీ ముందుకు హాజరు కావాల్సిందిగా ట్రంప్ కు , ఆయన సన్నిహితుడి కి నోటీసులు పంపింది హౌజ్ కమిటి అయితే
ముందుగా ట్రంప్ సన్నిహితుడు సీవ్ బ్యానన్ కు నోటీసులు పంపగా విచారణకు హాజరు కాకపోవడంతో హజ్ కమిటి నోటీసులను ధిక్కరించిన కారణంగా అతడికి నాలుగు నెలల జైలు శిక్షతో పాటు 6500 డాలర్ల జరిమానా విధించారు.బ్యానన్ హౌజ్ కమిటిని దిక్కరించడమే కాకుండా అవమానించారని అందుకు ఈ శిక్ష తప్పదని జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ తెలిపారు.అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్ కి సైతం నోటీసులు పంపింది హౌజ్ కమిటి.
నవంబర్ 14 న ట్రంప్ హౌజ్ కమిటి ముందు హాజరు కావాలని క్యాపిటల్ హిల్ దాడి ఘటన విషయంలో వాంగ్మూలం ఇవ్వాలని తెలిపింది.ఒక వేళ ట్రంప్ కూడా కమిటి ముందు హాజరు కాకపొతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడా
.