Jansena Pawan Kalyan : అంతా ఆయనే చేస్తున్నాడా ? జనసైనికుల గుర్రు

రాష్ట్రంలో ఏ సినీ హీరోకు, రాజకీయ నాయకులకు లేనంత ఫాలోయింగ్, అభిమానులు పవన్ కు ఉన్నారు.జనసేన పార్టీ( Janasena ) తరఫున ఎక్కడ ఏ సభ నిర్వహించినా, సొంత ఖర్చులతో సభకు హాజరై ఆ సభలను విజయవంతం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు జనసేన కార్యకర్తలు.

 Janasena Leaders Angry On Nadendla Manohar-TeluguStop.com

మిగతా పార్టీల కంటే భిన్నంగా ఉంటూ తమ అభిమాన నాయకుడిని ఉన్నత స్థాయిలో చూసేందుకు క్షేత్రస్థాయిలో జనసేన కోసం పోరాడుతూ ఉంటారు.అయితే ఇప్పుడు ఆ జనసైనికుల్లోనే పార్టీలోని కీలక నేతపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుంది .ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తు ( TDP Jansena Alliance )విషయంలో పవన్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని, కొన్నిచోట్ల అభ్యర్థులుగా ప్రకటించిన వ్యక్తులు కొత్తగా పార్టీలో చేరిన వారు కావడం, మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి, టీడీపీ నుంచి వచ్చి చేరిన వారికి మెజారిట టికెట్లు కేటాయించడం వంటివి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenaangry, Janasenani, Pavan Kalyan, Telug

అలాగే జనసేనకు టిడిపి తో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ ,2 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం పైన వారిలో అసంతృప్తి కలిగిస్తోంది.జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కాకుండా, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల సీట్లు తీసుకోవడం, ఈ విషయంలో పవన్ ను ఒప్పించే విధంగా నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ప్రయత్నించి సక్సెస్ కావడం వంటివన్నీ వారికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.ముఖ్యంగా జనసేనకు గట్టిపట్టు ఉన్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకోకుండా, రాయలసీమ జిల్లాల్లో జనసేనకు ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో పోటీకి దిగడం వంటి వ్యవహారాల వెనుక నాదెండ్ల మనోహర్ పవన్ ను పక్కదారి పట్టించేలా చేశారని, పవన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా ద్వారా జనసైనికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenaangry, Janasenani, Pavan Kalyan, Telug

ఇప్పటికే నాదెండ్ల మనోహర్ వ్యవహార శైలి కారణంగా ఎంతోమంది పార్టీని వీడి వెళ్లిపోయారని, మొదటి నుంచి పవన్( Pawan Kalyan ) వెంట తిరుగుతూ, తప్పుడు సమాచారం అందిస్తూ, పవన్ కోసం పనిచేస్తున్న నేతలను నాదెండ్ల పక్కన పెడుతూ వస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.సీత సర్దుబాటు విషయంలో చంద్రబాబు డైరెక్షన్ లో నాదెండ్ల మనోహర్ పవన్ ను పక్కదారి పట్టించారని, తప్పుడు సలహాలు ఇస్తూ పార్టీని బలహీనం చేస్తున్నారని మండిపడుతున్నారు.టిడిపి నుంచి వచ్చి చేరిన నేతలకు ఎక్కువగా టిక్కెట్లు ఇప్పించడంలో, ఈ విషయంలో పవన్ ను ఒప్పించడంలో నాదెండ్ల సక్సెస్ అయ్యారని, మొదటి నచి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తిరుపతి సీటు విషయానికొస్తే అప్పుడే పార్టీలో చేరిన ఆరాణి శ్రీనివాసులకు( Arani Srinivasulu ) ఇవ్వడం పైన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదేవిధంగా చాలా నియోజక వర్గాల్లో టిడిపి నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.నిజమైన జనసేన నాయకులను పక్కన పెట్టారంటూ వారు నాదెండ్ల మనోహర్ పైనే మండి పడిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube