ఐపీల్ స్కాంలో భారీ కుంభకోణం చేసిన లలిత్ మోడీ మొదలుకొని నీరవ్ మోడీ, విజయ్ మాల్యాల వరకు అందరూ కోట్లలో బ్యాంకులకు పంగనామాలు పెట్టి విదేశాల్లో స్వేచ్ఛగా బతికేస్తున్నారు.అయితే తాజాగా వీరి జాబితాలో మారుతీ ఉద్యగో లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఆయన కంపెనీ ద్వారా రూ.110 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఏకంగా రూ.170 కోట్ల రుణం తీసుకున్నాడు.బ్యాంకుకు తాఖా పెట్టిన ఆస్తులను ఖట్టర్ అనధికారికంగా అమ్మేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.
దీంతో జగదీష్ ఖట్టర్, అతడి కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఆయనతో పాటు ఈ కుంభకోణంలో మరో ఐదురుగురి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
వారిని సీబీఐ ఆఫీసర్లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కేసు ఎటు నుండి ఎటు వెళుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పీఎన్‌బీ ఫిర్యాదు పేరుతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి ఈ కేసును సుదీర్ఘంగా విచారిస్తున్నారు.మరి ఖట్టర్ కూడా విదేశాలకు పారిపోతాడా లేక భారత్‌లోనే శిక్ష అనుభవిస్తాడా అనేది చూడాలి.