వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) సెటైర్లు వేశారు.గత కొంతకాలంగా లోకేష్ బహిరంగంగా ఏ సమావేశాల్లోనూ పాల్గొనడం లేదు .
జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఉమ్మడి సభకు లోకేష్ దూరంగానే ఉన్నారు.లోకేష్ ఎక్కడ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది.
నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా జగన్ పై సెటైర్లు వేశారు.మీ బిడ్డను అంటున్న సీఎం జగన్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లోకేష్ సూచించారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే , రాష్ట్ర ఖజానా దివాళా తీసింది అని లోకేష్ విమర్శించారు.ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం, అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్ డీ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని 370 కోట్లకు జగన్ తాకట్టుపెట్టారు.
ఖనిజ సంపద తనఖాతో 7 వేల కోట్లు, మందుబాబులను తాకట్టుపెట్టి 33 వేల కోట్లు అప్పులు తెచ్చారని ,ఆయన పాలనలో ఇక మిగిలింది ఐదు కోట్ల మంది జనం మాత్రమేనని, ఎప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేడుకలపై ఓదరగొడుతున్న జగన్ మాటలు వెనక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలని లోకేష్ సూచించారు రాబోయే రెండు నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని లోకేష్ సూచించారు.వైసిపి( YCP ) సిద్ధం సభలోను ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అదే పని గా టిడిపి ని టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు చేస్తుండడంతో పాటు మీ బిడ్డను అంటూ జనాలను ఉద్దేశించి సెంటిమెంట్ ను రగిల్చే విధంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ సెటైర్లు వేశారు.
ప్రస్తుతం లోకేష్( Lokesh ) పార్టీ అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గం పార్టీ పరిస్థితులను మెరుగుపరిచే అందుకు ఏం చేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు అలాగే తాను పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా గెలిచేందుకు, అక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే విషయం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు ప్రస్తుతం టిడిపి అభ్యర్థుల జాబితా ప్రకటన జనసేనతో పొత్తు సమన్వయం రెండు పార్టీలు కలిపి ఉమ్మడి సమావేశాలు అన్నిటిని టిడిపి అధినేత చంద్రబాబు చూసుకుంటున్నారు కొద్దిరోజులుగా సభలు సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.