ఏపీలో రాజకీయ పార్టీల మధ్య హారాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది.ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు .
ఈ మేరకు ఆయా పార్టీ ల అధినేతలంతా రంగంలోకి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం( Memantha Siddham ) పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తుండగా, టిడిపి జనసేన( TDP , Janasena ) పార్టీలు ఉమ్మడిగా ప్రజాగణం యాత్రలు నిర్వహిస్తున్నాయి.
ఎండ వేడి సైతం లెక్కచేయకుండా నిత్యం జనాల్లో ఉంటూ, పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికల ప్రచార సభలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.మరోవైపు చూస్తే రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి.ఏపీలో అధికారంలోకి రాబోయేది పలానా పార్టీ అంటూ ఎన్నికల సర్వేలు తెరమీదకు వస్తున్నాయి.
కొన్ని సర్వేలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తుండగా మరికొన్ని సర్వేలు మరో పార్టీ అధికారంలోకి వస్తుందని నివేదికలు ఇస్తున్నాయి.ఈ సర్వేల సంగతి పక్కన పెడితే .బహిరంగ సభలో పాల్గొంటున్న జగన్ చంద్రబాబు లను ఒకసారి పరిశీలిస్తే జగన్ గెలుపు తమదే అన్న ధీమా లో ఉన్నట్టుగా కనిపిస్తుండగా, చంద్రబాబు మాత్రం కాస్త ఆందోళన చెందుతున్నట్టుగానే ఆయన ముఖ కవళికలు ఉన్నాయి.గతంతో పోలిస్తే టిడిపి బలంగానే ఉంది .2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితమైనా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు .హారా హోరీగా పోరు ఉండబోతోంది.వైసిపి వి బలంగా ఢీకొట్టే స్థాయిలోనే టిడిపి ఉంది.దీనికి తోడు జనసేన, బిజెపిల తో పొత్తులో ఉంది.2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడగానే ఎన్నికల్లో పోటీ చేశాయి.ఇప్పుడు వీరంతా ఏకం కావడంతో టిడిపి కి బలం మరింతగా పెరిగింది.
అయినా చంద్రబాబులో మాత్రం ఆందోళన కనిపిస్తూనే ఉంది.దీనికి కారణం లేకపోలేదు.చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అనేది స్పష్టం .ఇప్పుడు ఉన్నట్టుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు( Chandrababu Naidu ) యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదు.ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తేనే ఆ తరువాత టిడిపికి ఏ డొకా ఉండదు. కానీ ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందతే టిడిపి భవిష్యత్తుతో పాటు, తన రాజకీయ వారసుడు లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బందులు తప్పవనే భయము చంద్రబాబులో కనిపిస్తోంది .కానీ జగన్( CM ys jagan ) విషయంలో ఆ పరిస్థితి లేదు.వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందినా, ఆ తరువాత ఎన్నికల్లోనైనా గెలవగలననే ధీమా జగన్ లో కనిపిస్తోంది.
జగన్ ధీమా, చంద్రబాబు టెన్షన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో జనాలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.