మంగళగిరే ముఖ్యం : రాష్ట్ర పర్యటనలకు లోకేష్ దూరం అందుకేనా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) రాష్ట్ర పర్యటనలకు పూర్తిగా స్వస్థ పలికినట్లుగా కనిపిస్తున్నారు.ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) కూటమి తరుపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

 Tdp Nara Lokesh Ap Elections Mangalagiri Constituency,nara Lokesh,mangalagiri, T-TeluguStop.com

ఉమ్మడిగా సభలు , సమావేశాలు నిర్వహిస్తూ వైసిపి పై నిప్పులు చెరుగుతున్నారు .మళ్లీ జగన్( YS Jagan ) అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ పదే పదే ప్రకటనలు చేస్తూ,  ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు .అయితే పార్టీలో కీలక నాయకుడిగా, యువ నేతగా గుర్తింపు పొందిన లోకేష్ కేవలం తాను పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం , రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఆయన అంతగా ఆసక్తి చూపించకపోవడం వెనుక కారణాలు చాలా కనిపిస్తున్నాయి.

Telugu Janasena, Mangalagiri, Lokesh, Pawan Kalyan, Tdplokesh-Politics

ఈసారి మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Constituency )లో గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ ఉన్నారు.2019 ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందారు లోకేష్.మళ్లీ లోకేష్ ను ఓడించేందుకు వ్యూహం రచిస్తున్న వైసిపి( YCP ) తమ అభ్యర్థిగా మురుగుడు లావణ్యను ప్రకటించింది.

చేనేత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం , ఆ సామాజిక వర్గంలో లావణ్య అత్తింటి,  పుట్టింటి వారికి గట్టిపట్టు ఉండడం వన్నీ కలిసి రాబోతున్నాయి .దీంతో లోకేష్ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల గా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Janasena, Mangalagiri, Lokesh, Pawan Kalyan, Tdplokesh-Politics

పొరపాటున ఇక్కడ ఓటమి చెందితే ఒక మహిళ చేతుల్లో ఓడిన వ్యక్తిగా అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సి వస్తుందని,  రాజకీయంగా కోలుకోవాలని, తన రాజకీయ భవిష్యత్తు( Political Future ) ఘోరంగా దెబ్బతింటుంది అనే భయం లోకేష్ లో కనిపిస్తోంది అందుకే పూర్తిగా మంగళగిరి నియోజకవర్గం లోనే పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.ఇక్కడ గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.తాను మంగళగిరి నియోజకవర్గానికి పరిమితం కావడంపై రాజకీయంగా తనపై విమర్శలు వచ్చినా అవేమి పట్టించుకోనట్లుగానే లోకేష్ వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube