అమెరికా : హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన భారత సంతతి నేత నిక్కీహేలీ

భారత సంతతికి చెందిన అమెరికన్ రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీ( Nikki Haley ) 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం ఆమె పోటీపడ్డారు.

 Indian-american Politician Nikki Haley Joins Hudson Institute Think Tank , Nikk-TeluguStop.com

కానీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump ) దూకుడైన రాజకీయం ముందు ఆమె నిలబడలేకపోయారు.చివరికి నిక్కీ హేలీ అధ్యక్ష బరిలోంచి తప్పుకున్నారు.

సూపర్ ట్యూస్డే సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో రిపబ్లికన్ ప్రైమరీ( Republican primarie ) రేసు నుంచి తప్పుకోవాలని నిక్కీహేలీ నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ఏం చేయబోతున్నారంటూ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.

ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలో వున్న సంప్రదాయ థింక్ ట్యాంక్ అయిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరినట్లు దాని సీఈవో, చైర్‌పర్సన్ వాల్టర్ పీ స్టెర్న్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telugu Donald Trump, Hudsoninstitute, Indianamerican, Nikki Haley, Walter Stern-

నిక్కీ విదేశీ, దేశీయ విధానం రెండింటిలోనూ నిరూపితమైన సమర్ధవంతమైన నేత.ప్రపంచవ్యాప్త రాజకీయ తిరుగుబాటు యుగంలో ఆమె అమెరికన్ భద్రత, శ్రేయస్సు‌కు శ్రమించారని జాన్ పీ వాల్టర్స్ ప్రశంసించారు.నిక్కీ హేలీ హడ్సన్ టీమ్‌లో చేరడం తమకు గర్వకారణమని వాల్టర్స్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో ఐక్యరాజ్యసమితి( United Nations )లో యూఎస్ రాయబారిగా ఇజ్రాయెల్-యూఎస్ సంబంధాలు బలోపేతం కావడానికి , పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం వెనుక నిక్కీహేలీ కృషి చేశారు.

Telugu Donald Trump, Hudsoninstitute, Indianamerican, Nikki Haley, Walter Stern-

హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ .ఒక థింక్ ట్యాంక్‌గా ప్రఖ్యాత అమెరికన్లు పనిచేసిన ప్రదేశంగా ఖ్యాతి గాంచింది.మాజీ స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో, మాజీ రవాణా కార్యదర్శి ఎలైన్ చావో‌లు 2021లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.2022లో మరణించిన దివంగత మాజీ హార్డ్‌బాడీ మరణానికి ఇన్‌స్టిట్యూట్ సంతాపం వ్యక్తం చేస్తున్న సమయంలో భారతీయ అమెరికన్ రాజకీయ వేత్త వాల్టర్ పి.స్టెర్న్ చైర్‌గా నియమితులయ్యారు.ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి.మధ్యలోనే రేసు నుంచి తప్పుకున్న పలువురు నేతలు కూడా కొత్త కొత్త పాత్రలను స్వీకరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube