వైరల్ వీడియో: యూనివర్సల్ బాస్ దెబ్బకి పగిలిన విండో గ్లాస్..!

క్రికెట్ లో యూనివర్సల్ బాస్ ఎవరంటే అది క్రిస్ గేల్. ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ అయినా ఎదురుదాడి చేసి విధ్వంసం సృష్టిస్తాడు.

 Viral Video Chris Gayle Huge Six Broke The Window Glass In Cpl, Chris Gayle,cpl,-TeluguStop.com

సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడతాడు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్.ఇక టీ20 ఫార్మాట్ లో అయితే క్రిస్ గేల్ విధ్వంసం మామూలుగా ఉండదు.

ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు.

తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2021లో క్రిస్ గేల్ భారీ సిక్సర్ కొట్టాడు.

ఆ సిక్స్ కు స్కోర్ కార్డ్ డిస్ ప్లే చేసే స్క్రీన్ గ్లాస్ పగిలిపోయింది.సీపీఎల్ 2021లో సెంట్ కిట్స్ నెవిస్ పాట్రియోట్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదైంది.

సీపీఎల్ లో క్రిస్ గేల్ సెయింట్ కిట్స్ నెవిస్ పాట్రియాట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఐదో బంతిని క్రిస్ గేల్ స్ట్రయిట్ సిక్స్ కొట్టాడు.

ఆ బాల్ స్కోర్ బోర్డు స్క్రీన్ కు తగిలింది.దీంతో ఆ స్క్రీన్ పై ఉన్న విండో అద్దం పగిలిపోయింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 9 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

ఈ మ్యాచ్ లో సెయింట్ కిట్స్ జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది.20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది.

39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సెయింట్ కిట్స్ ను షెర్ఫానె రుథర్ ఫోర్డ్(53), డ్వేన్ బ్రావో(47) ఆదుకున్నారు.చివర్లో ఫాబియన్ అలెన్(19) రాణించడంతో సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్ దిగిన బార్బడాస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 రన్స్ చేసింది.21 పరుగులతో సెయింట్ కిట్స్ విజయం సాధించింది.బార్బడాస్ తరఫున షైహూప్(44), ఆజమ్ ఖాన్(24) మాత్రమే రాణించారు.మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.సెయింట్ కిట్స్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 2, డొమినిక్ డ్రేక్స్ 2, ఫాబియన్ ఒక వికెట్ తీశారు.సెయింట్ కిట్స్ ఆటగాడు రూథర్ ఫోర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube