పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో ఈ సినిమాలో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో మొదటిసారి సందడి చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో మైక్ టైసన్ కి సంబంధించిన లుక్స్ విడుదల అవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ నటించబోతున్నారని తెలియగానే ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్న అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండగా మైక్ టైసన్ మాత్రం ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఏకంగా వీల్ చైర్ లో కూర్చొని,చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకొని కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఇలా వీల్ చైర్ కు పరిమితం కావడం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈయన గత కొన్ని రోజుల నుంచి వెన్నునొప్పి సయాటికా అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారట.ఈ క్రమంలోనే డాక్టర్లు ఈయనని కేవలం వీల్ చైర్ మాత్రమే ఉపయోగించాలని చెప్పడంతో ఈయన ఇలా వీల్ చైర్ లో కనిపించారు.ఇలాంటి అనారోగ్య సమస్యతో ఈయన బాధపడుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈయనని చూడగానే సెల్ఫీ అంటూ ఎగబడటం అందరిని కాస్త విష్మయానికి గురిచేస్తుంది.
ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అభిమానులు తొందరగా ఈయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.