ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయమే ఎదురయ్యింది. మూడో స్థానానికి బిజెపి వెళ్ళింది.
ఈ పరాజయం నుంచి తేరుకుని, వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుని, వీలైనంత ఎక్కువ లోక్ సభ స్థానాలను దక్కించుకోవాలని బిజెపి అగ్ర నేతలు ప్రయత్నాలు చేస్తుండగా… తెలంగాణ బిజెపి నాయకుల తీరు మాత్రం మరోలా ఉంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , ఆ ప్రభావం ఎనకల్లో పడుతుండడం పై బీజేపీ అగ్ర నేతలు సీరియస్ గానే ఉన్నారు.
ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే వస్తున్నాయి.గతంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయం నుంచి ఆయనతో రాజేందర్ కు ఏర్పడిన వైరం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింతగా ముదిరిందట.
అసెంబ్లీ ఎన్నికల లో ఓటమి తర్వాత ఏ మాత్రం సఖ్యత కనిపించడం లేదు.పార్టీ కార్యక్రమాలలోనూ ఇద్దరు కలిసి పాల్గొనడం లేదు ఒకరు వస్తే మరొకరు ఆ కార్యక్రమానికి గైర్హాజరు అవుతుండడంతో, కేడర్ కూడా అయోమయంలో ఉందట. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నార బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ యాత్ర ఇప్పటి వరకు వేములవాడ, సిరిసిల్ల హుస్నాబాద్ లో కొనసాగి హుజురాబాద్( Huzurabad ) కు చేరుకుంది.
అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు, గెలిచిన నేతలు అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కానీ, ఆయన అనుచరులు కానీ సభకు హాజరు కాకపోవడం తో వీరి మధ్య వైరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సుదీర్ఘకాలం ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉన్న ఈటెల రాజేందర్( Etela Rajender ) ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నుంచి ఈ నియోజకవర్గం వైపు చూడడం లేదు అని, ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్న మల్కాజి గిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లు ఈ ఇద్దరు నేతల మధ్య వైరం కారణంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలను కోల్పోయామనే విషయాన్ని బిజెపి అధిష్టానం గుర్తించింది.బిజెపి కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) గట్టిగానే క్లాస్ పీకినా, పరిస్థితిలో మార్పు కనిపించడం లేదట.